తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకి సంబంధించిన వార్తలు ఎక్కువుగా ప్రజల వద్దకు వస్తున్నాయి. పేపర్, టెలివిజన్, రేడియో, డిజిటల్ వంటి మాధ్యమాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు, పార్టీలకి సంబంధించిన ప్రచార వీడియోలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. – AudienceReports.com
టెలివిజన్ లో ప్రముఖ ఛానల్స్ లో ఉన్న ఎన్టీవి న్యూస్ ఛానల్ రాజకీయ నేపథ్యం ఉన్న కార్యక్రమంగా నిరంతరం రాజకీయ వార్తలను ప్రచారం చేస్తుంది. పోల్ యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి విశ్లేషనతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. – AudienceReports.com
పోల్ యాత్ర అనే కార్యక్రం సాధారణ స్ట్రాటజీ కంటే విభిన్నంగా ఓటరు నాడిని పట్టుకునేందుకు కార్యక్రమం ముందుకు వెళుతుంది. ఒక టూ వీలర్ లో యాంకర్ సాధారణ రిపోర్టింగ్ చేస్తూ ఆ నియోజకవర్గంలో పోటీ పడుతున్న రాజకీయ నాయకులు పనితీరుపై పూర్తి విశ్లేషణ జరుగుతుంది. ఎన్టీవికి పోటీగా ఉన్న ఛానల్స్ లో ఈ కార్యక్రమం బార్క్ రేటింగ్స్ లలో ముందు ఉండటం జరిగింది. డిజిటల్ లోనూ పోల్ యాత్ర కార్యక్రమానికి మంచి స్పంధన కలుగుతుంది. AudienceReports.com