సాధారణంగా తెలుగులో దాదాపు 24 ప్రధాన తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ లో ఎక్కువుగా ముఖ్యమైన ఛానల్స్ కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. ఇతర ఛానల్స్ లోని నాలుగు ఛానల్స్ కొద్దిపాటి నష్టంతో కొనసాగుతున్నాయి. ఇక తరువాత లిస్ట్ అంతా యాజమాన్యం ఇబ్బంది పడే విధంగా నష్టాలలో కొనసాగుతున్నాయి.
తెలుగులో ప్రతి 3 సంవత్సరాలకి కనీసం మూడు, నాలుగు కొత్త ఛానల్స్ వస్తున్నాయి. వీటిలో గడిచిన ప12 సంవత్సరాల నుండి వచ్చిన రిపోర్ట్స్ ని చూసే చాలా ఛానల్స్ నష్టాలతో గడిపింది. కొన్ని ఛానల్స్ నష్టాలతో కొనసాగించలేక మూతకి గురికాబడ్డ ఛానల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో చాలా చిన్న ఛానల్స్ రెవెన్యూ తక్కువుతో కొనసాగుతున్నాయి. వీటిని ఇంకా ఎంత కాలం ముందుకు తీసుకువస్తారో అనేది యాజమాన్యం నిర్ణయించుకోలేకపోతున్నాయి.
తెలుగులో కొద్దిపాటి పేరు ఉన్న చిన్న ఛానల్స్ లో రెవెన్యూ లోటుతో ముందుకు వెళుతున్న ఛానల్స్ లిస్ట్ ఎపి 24జ7 న్యూస్, హెచ్.ఎం.టివి,ఐ న్యూస్, స్టూడియో ఎన్, రాజ్ న్యూస్, నైన్టీనైన్ న్యూస్, స్నేహా టివి, మహా న్యూస్, టెన్ టివి, ఈటివి తెలంగాణ, ఈటివి ఆంధ్రప్రదేశ్, సివిఆర్ న్యూస్, ఉన్నాయి. లిస్ట్ లో ఉన్న ఛానల్స్ కి మార్కెట్ లో ప్రఖ్యాత పేరు ఉన్నప్పటికీ, రెవెన్యూ లోటుతో ముందుకు వెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారానికి సంబంధించిన నిరాశ ఉండటంతో కింద ఉన్న ఛానల్స్ రెవెన్యూతో ముందుకు కదలేకపోతున్నాయి.