రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ కి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ ని మే 23న ప్రతి ఒక్కరూ ఉత్కంఠ భరితంగా చూశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్స్ పై దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠత కారణంగా, టెలివిజన్ లో వీటిని చూసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు.
దీన్ని గుర్తించిన తెలుగు న్యూస్ ఛానల్స్, అడ్వెర్టైజ్మెంట్స్ తో రెవెన్యూ జెనరేట్ చేసుకోవాలని చూశారు. ఆ విధంగానే ప్రతి తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ప్రత్యేక ప్యాకేజ్ ని రెడీ చేసుకున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ ని చూస్తూనే ఎడ్వర్టైజ్మెంట్స్ ని చూసే విధంగా వారి స్క్రీన్స్ లే అవుట్ ని రెడీ చేసుకొన్నారు.
ప్రధాన న్యూస్ ఛానల్స్ తో పాటు ఇతర న్యూస్ ఛానల్స్ లోనూ ఈ విధమైన పద్ధతినే అవలంభించారు. అయితే ఆడియన్స్ రిపోర్ట్స్.కమ్ రిపోర్ట్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రోజు బ్రాండ్ ని ఎలివేట్ చేసుకోవటానికి అడ్వరైజర్స్ ఖర్చు పెట్టిన మొత్తం దాదాపు 1.95 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఛానల్స్ లో ప్రముఖంగా కనిపించిన యాడ్స్ వివరాలను చూస్తే….
BIG C
CMS for CA
APARNA – lead the future
NCL
PRAKRUTHI AVENUES PVT.LTD
KLM FASHION MALL
BHARATHI CEMENT
బ్రిలియంట్ గ్రామర్ స్కూల్
శాస్త్రి బామ్
శ్రీ చైతన్య
లలిత జ్యూయలరీ
కంచి కామాక్షి
డా.రమణమూర్తి
కోకోలి
డాక్టర్ కాఫర్
నారాయణ విద్యాసంస్థలు
CMR షాపింగ్ మాల్
శ్రీ గాయత్రి విద్యాసంస్థలు
సథరన్ ట్రావెల్స్
xxx డిటర్జెంట్
తెలుగు రాష్ట్రాల్లో పైన ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం మార్కెట్ లో ప్రచారానికి ఆసక్తి ఉన్నవి.
ఇక నేషనల్ టివి ఛానల్స్ లోనూ ఇదే హావా కొనసాగింది. నేషనల్ టివి ఛానల్స్ లో కనిపించిన యాడ్స్ సైతం ఎక్కువుగానే ఉన్నాయి. నేషనల్ ఛానల్స్ లో కనిపించిన యాడ్స్ వాల్యూ దాదాపు 11.54 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాగే దేశ వ్యాప్తంగా చూసుకుంటే టెలిజన్ లో ఎలక్షన్ రిజల్ట్స్ కోసం బ్రాండ్స్ ఖర్చు చేసిన మొత్తం 27 కోట్ల రూపాయల వరకూ ఉంటుందనేది ఒక అంచనా.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/