ప్రతి సంవత్సరం తెలుగులో టివి ఛానెల్స్ ఎన్నో వస్తున్నాయి. మరెన్నో మూతపడుతున్నాయి. సొంత శాటిలైట్ ఛానెల్స్ పర్మిషన్స్ ప్రస్తుతం రావటం చాలా కష్టంగా ఉండటం వల్ల…చాలా మంది లీజ్డ్ శాటిలైట్ ఛానల్స్ తో నడిపిస్తున్నారు.
దీని వల్ల ఛానల్స్ పై మెయింటెన్స్ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. ఇదిలా ఉంటే గత పది సంవత్సరాలుగా చూసుకుంటే చాలా కొద్ది ఛానల్స్ మాత్రమే రెవెన్యూ పరంగా నిలకడగా ఉంటున్నాయి. మిగతా ఛానల్స్ అన్నీ రెవెన్యూ తెచ్చుకోలేక మూతపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.
టివి ఛానల్స్ ప్రారంభంలో మార్కెట్ లో క్రెడిబిలిటి ఉన్న మార్కెటింగ్ టీం ను సెలక్ట్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు ఛానల్స్ లో రీజనల్ మార్కెటింగ్ నుండి ఎంత రెవెన్యూ తెచ్చుకోవచ్చు అనే కనీస అవగాహన మేనేజ్మెంట్ వద్ద లేకుండా పోయింది.
అయితే ఛానల్ ప్రారంభంలో వస్తున్న మార్కెటింగ్ టీం మాత్రం కోటి రూపాలు తెస్తాం, అరవై లక్షలు తెస్తాం, ఎనభై లక్షలు తెస్తాం అని మాటలు చెప్పి, చివరకు క్లయింట్స్ కి క్రెడిట్స్ ను సైతం రాబట్టుకోలేని పరిస్థితి.
గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకూ చూసుకుంటే కేవలం బ్రాండ్ వాల్యూను మెయింటెన్ చేస్తున్న ఛానల్స్ మాత్రమే రెవెన్యూను తెచ్చుకోగలుగుతున్నాయి. ఈటివి, టివి9, ఎన్టీవి, ఎబిన్ ఆంధ్రజ్యోతి, టివి5, వి6, టి న్యూస్, సాక్షి టివి వంటి ఛానల్స్ మాత్రమే రెవెన్యూలో నిలకడగా ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేవి రీజనల్ మార్కెటింగ్ కంటే నేషనల్ మార్కెటింగ్ మీదే ఎక్కువ రెవెన్యూ సోర్స్ ఆధారపడి ఉంది కాబట్టి రీజనల్ లో అంత ప్రాముఖ్యత ఉండవకపోవచ్చు. కానీ రీజనల్ మార్కెటింగ్ కి సంబంధించిన స్ట్రాంగ్ టీం ను జీ తెలుగు, స్టార్ మా, ఈ టివి ఛానల్స్ మెయింటెన్ చేస్తున్నాయి.
అయితే బ్రాండ్ ఉన్న ఛానల్స్ కి మార్కెట్ లో రెవెన్యూ క్రియేట్ చేయటం అనేది శ్రమ తక్కువుతో కూడుకున్నది. బ్రాండ్ లేని ఛానల్స్ కి మార్కెటింగ్ చేసి ఛానల్స్ ని నిలపడం అనేది చాలా స్కిల్స్ తో కలిగిఉన్న పని. ఆ విధంగా చూస్తే బ్రాండ్ లేకపోయిన ఛానల్స్ కి మార్కెటింగ్ చేయగల స్కిల్ ఉన్న టీం ప్రస్తుతం మీడియాలో చాలా అరుదుగా ఉన్నాయి. అందులో జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి టీం ఒకటి. ఛానల్ కి బ్రాండ్ ఉన్నా లేకపో యినా ఓ స్టేబుల్ రెవెన్యూని ఈ టీం తీసుకురాగలదని ఇప్పటికే పలు ఛానల్స్ విషయంలో నిరూపించింది.
ఒకవేళ ఛానల్స్ కి బ్రాండ్ వాల్యూ ఉంటే మాత్రం ఆ ఛానల్ ను కోటి రూపాల రెవెన్యూ వరకూ తీసుకువెళ్ళగలిగే బ్రేక్ ఈవెన్ ని కూడ ఇవ్వగలరు. న్యూస్ ఛానల్స్ కి సంబంధించిన రెవెన్యూ విషయంలో రీజనల్ మార్కెటింగ్ పర్సెంటేజ్ 40 శాతం ఉంటే, నేషనల్ మార్కెటింగ్ పర్సెంటేజ్ 60 శాతం ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో కొన్ని ఛానల్స్ ఈ ఈక్వేషన్స్ ని అర్ధం చేసుకోకుండా మార్కెటింగ్ టీం పై ఒత్తిడి తెచ్చి, గంధరగోళం క్రియేట్ చేసుకుంటాయి.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/