ఈ మధ్య కాలంలో మోజో టివి అనే పేరు అందరికి ఎక్కువుగావినిపిస్తుంది. టివి9 కు మాజీ సిఇఓ గా ఉన్న రవిప్రకాష్, టివి9 ఫండ్స్ ని మోజో టివికి పంపించి, మోజోటివి తనకు నమ్మకమైన వ్యక్తులనే పెట్టుకుని నడిపిస్తున్నారనేది.
కొత్తగా వచ్చిన టివి9 మేనేజ్మెంట్ ఆరోపిస్తున్న మాటలు. కాదు ఇవి అక్షరాల నిజం అని కూడ వాళ్ళ దగ్గర లీగల్ ప్రూవ్స్ ఉన్నాయనేది వినిపిస్తున్న మాట. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే…ప్రస్తుతం మోజో టివి నుండి సిఇఓ గా బాధ్యతలు నిర్వర్తించిన రేవతి విధుల నుండి నిష్క్రమించారు అనేది అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.
అలాగే టివి9 కొత్త మేనేజ్మెంట్ సైతం దీనిని దాదాపు ఖరారు చేసిందని టివి9లోనూ స్పష్టంగా తెలుస్తుంది. ఉధ్యోగస్తులకి అఫిషియల్ న్యూస్ లేకపోయినప్పటికీ…మేనేజ్మెంట్ నుండి మాత్రం సిఇఓ ఇక నుండి విధులకు హాజరుకారు అనే సమాచారాన్ని కిందిస్థాయి ఉద్యోగులకి ఇస్తున్నారని, ఉద్యోగులలో వినిపిస్తున్న మాటలు.
ఇక విధుల నుండి వైదొలగటానికి ఉన్న ప్రత్యేక కారణాలు చూస్తే…టివి9 కొత్త మేనేజ్మెంట్ కంటెంట్ పై ప్రత్యేకమైన దృష్టి సారించటంతో మెరుగైన టీంను పునరుద్దరించేందుకు మాత్రమే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/