‘బిగ్ బాస్ 3’కి రీజ‌న‌ల్ బిజినెస్ అంత సుల‌భం కాదు

BIG BOSS3 TELUGU Audience Reports
BIG BOSS3 TELUGU Audience Reports

స్టార్ మా నుండి వ‌స్తున్న సీస‌న్ 3 సూప‌ర్ హిట్ షో బిగ్ బాస్ 3. మొద‌టి రెండు సీజ‌న్ లు రేటింగ్ ప‌రంగా స‌క్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ 3 గా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన బిగ్ బాస్ 3 టీజ‌ర్ టెలివిజ‌న్ ఆడియ‌న్స్ లో కొత్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

బిజినెస్ ప‌రంగా బిగ్ బాస్ 3ని చూసుకుంటే మొద‌టి రెండు సీజ‌న్ ల కంటే 3వ సీజ‌న్ కాస్త ఎక్కువుగానే టార్గెట్ చేసింది. దాదాపు 10 కోట్ల రూపాయ‌ల బిగ్ బాస్ 3 టార్గెట్ చేసుకొంది. అయితే ఇందులో రీజ‌న‌ల్ బిజినెస్ షేర్ క‌నీసం 40 శాతం ఉండేలా ప్లాన్ చేసుకున్న‌ట్టు ఏజెన్సీ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఎగ్జిటివ్స్ స‌మాచారం.

BIG BOSS 3 regional ads

బిజినెస్ టార్గెట్ బాగున్న‌ప్ప‌టికీ…క్ల‌యింట్స్ నుండి వ‌స్తున్న సందేహాల‌కు ఇంకా బిగ్ బాస్ 3 హౌస్ నుండి స‌మాధానాలు రావ‌టం లేదు. బిగ్ బాస్ 3 హైలైట్స్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 3 సీజ‌న్ ఎన్ని రోజులు, బిగ్ బాస్ 3 యాడ్స్ డిస్ ప్లే స్క్రీనింగ్స్, ప్లేసెమెంట్స్ వంటిపై బ్రాండ్ ప్ర‌మోట‌ర్స్ కి స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేక పోతున్నారు.

ఇక‌, బిగ్ బాస్ 3 కి ఇప్ప‌టి వ‌ర‌కూ రీజ‌న‌ల్ క్ల‌యింట్స్ గా తెనాలి డబుల్ హార్స్ మినుప‌గుండ్లు, గ‌గ‌గ డిట‌ర్జెంట్ సోప్ మాత్ర‌మే ఉన్నాయి. బిజినెస్ టార్గెట్ ప్ర‌కారం చూసుకుంటే బిగ్ బాస్ 3 మూడవ సీజ‌న్ కి రీజ‌న‌ల్ యాడ్స్ రెండు కోట్ల రూపాయ‌లు మించి ఉండ‌ద‌నేది ప్ర‌స్తుత ఏజెన్సీల అనాలిసిస్ రిపోర్ట్స్.

అయితే బిగ్ బాస్ 3 ఫార్మెట్ లో కొత్తద‌నం అంచ‌నాలు మారే అవ‌కాశం ఉంది.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here