తెలుగు టెలివిజన్ లో ఉన్న రెండు కేటగిరీలు ఎంటర్టైన్మెంట్ , న్యూస్. ఈ రెండు ఛానల్స్ రేటింగ్స్ కోసం పెయిడ్ సర్వీస్ లను ఉపయోగించుకుంటున్నాయి.
రేటింగ్ కోసం పెయిడ్ సర్వీస్ ల పైన ఆధారపడుతున్న ఛానల్స్. తాజాగా బార్క్ స్వయంగా తెలుగు రాష్ట్రాల్లో టివి రేటింగ్ మీటర్స్ ని అక్రమపద్దతిలో ఉపయోగిస్తున్నారని హైదరబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టివి రేటింగ్ ట్యాంపరింగ్ చేసే ఏడుగురు వ్యక్తుల మీద క్రిమినల్, ఛీటింగ్ కేసు నమోదు చేయటమే కాక, చార్జిషీట్ ను ఓపెన్ చేసింది.
బార్క్ సంస్థ ఈ విధంగా కంప్లయింట్ చేయటం ఇదే మొదటిసారి. తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్, న్యూస్ ఛానల్స్ స్వయంగా రేటింగ్స్ ని పెంచాలని కొన్ని ఏజెన్సీలకు పనులు ఇవ్వటం జరుగుతుంది. రేటింగ్స్ పెరిగితే యాడ్ రేటు పెరుగుతుంది. ఛానల్ కు రెవెన్యూ రావాలంటే ఇదొక్కటే కీలకం. అందుకే ఛానల్స్ ఈ పద్దతిని ఎంచుకున్నాయి.
యాడ్ ఏజెన్సీలకు ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ క్లయింట్స్ దగ్గర ఈ విషయాలు ప్రస్థావించకుండా యాడ్స్ ని తెచ్చుకోగలుగుతున్నారు. దీని వల్ల క్లయింట్స్ వారి ప్రకటనలకు స్పంధన రాక నష్టపోవటం జరుగుతుంది. క్లయింట్స్ టివి రేటింగ్స్ పట్ల కనీసమైన అవగాహన పెంచుకోవటం ప్రస్తుత రోజుల్లో తప్పనిసరి అని ఆడియన్స్ రిపోర్ట్స్ సర్వే చెబుతుంది.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing