హైద‌రాబాద్ ను నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకువెళ్ళిన‌ ”డ్రీమ్ మ‌ర్చెంట్స్” యాడ్ ఏజెన్సీ

Dream Merchants AudienceReports

ఒక‌ప్పుడు తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ యాడ్ మేకింగ్ అంటే క‌చ్ఛితంగా చెన్నైకి వెళ్లాల్సిందే. లేదంటే ముంబాయ్ కి వెళ్ళాలి. ఎక్కువ మంది బ్రాండ్ కి ఉన్న ప్రాధాన్య‌త, దానిపై ఉన్న బ‌డ్జెట్ ప్ర‌కారం ముంబాయ్‌, చెన్నై వంటి ప్రాంతాల‌ను ఎంచుకుంటారు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో ముంబాయ్‌, చెన్నై, బెంగుళూరు వంటి సంస్థ‌లే హైద‌రాబాద్ లో క‌మ‌ర్షియ‌ల్ యాడ్ మేకింగ్ ని చేయించుకుంటున్నారు. దీనికి కార‌ణం ప్రస్తుతం హైద‌రాబాద్ లో అన్ని ర‌కాల ప్రొడ‌క్ష‌న్, టెక్నిక‌ల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండ‌ట‌మే. అంతే కాకుండా జాతీయంగా పేరు గాంచిన యాడ్ డైరెక్ట‌ర్స్ సైతం హైద‌రాబాద్ లో ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం టెలివిజ‌న్ లో చూస్తున్న ఎక్కువ బ్రాండ్ యాడ్స్ అన్నీ దాదాపు డ్రీమ్ మ‌ర్చెంట్స్ ఏజెన్సీ నుండి వ‌చ్చిన‌వే అని చెప్ప‌వ‌చ్చు. య‌మున కిశోర్ గారి ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైన డ్రీమ్ మ‌ర్చెంట్స్ ఏజెన్సీ చిన్న చిన్న‌గా ఎదుగుతూ ఇప్పుడు జాతీయ స్థాయి మార్కెట్ కి పోటీ ఇచ్చే విధంగా ఎదుగుతూ వ‌స్తుంది.

ఒక‌ప్పుడు వారు చేసే యాడ్స్ ని చెన్నై కంపెనీల స‌హాయంతో అవుట్ పుట్ ని ఇచ్చే వారు. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేకుండా హైద‌రాబాద్ లోనే అన్నింటిని పూర్తి చేసి ఇవ్వ‌టం జ‌రుగుతుంది. అయితే క్ల‌యింట్ కావాల్సిన క్యాలిటి ప్ర‌కారం మాత్ర‌మే అవుట్ కి సంబంధించిన బ‌డ్జెట్ ఉంటుంది.

ఇప్పుడు తెలుగు, త‌మిళ్, హిందీ, క‌న్న‌డ వంటి భాష‌ల్లో డ్రీమ్ మ‌ర్చెంట్స్ యాడ్స్ ని క్రియేట్ చేస్తుంది. తెలుగు యాడ్ మేకింగ్ డైరెక్ట‌ర్స్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద డైరెక్ట‌ర్స్ ప‌నిచేసిన‌ప్ప‌టికీ…ఒక ఏజెన్సీ త‌రుపున పెద్ద పెద్ద బ్రాండ్స్ కి యాడ్స్ చేసిన వాళ్ళు చాలా త‌క్కువ.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉన్న‌ది ఒకే ఒక ఏజెన్సీ డ్రీమ్ మ‌ర్చెంట్స్ అని మాత్రం చెప్ప‌వ‌చ్చు. హైద‌రాబాద్ ని యాడ్ మేకింగ్ లో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకువెళ్ళిన ఘ‌న‌త డ్రీమ్ మ‌ర్చెంట్స్ ది అని చెప్ప‌వ‌చ్చు. దీని వెనుక డ్రీమ్ మ‌ర్చెంట్స్ అధినేత యమున కిషోర్ పాత్ర కీల‌కం అని చెప్ప‌వచ్చు.

డ్రీమ్ మ‌ర్చెంట్స్ క‌మ‌ర్షిల్ యాడ్స్ చేసిన బ్రాండ్స్ః

Davanam Jewellers
Ajeet Seeds
Ananda Green mantra Developers
Chandana Brothers
Double Horse Minapagullu
Raki Avenues
CMR Shopping Mall
Psoriasiddh
Srinivasam
Gayatri Milk
Radha TMT
Suvarnabhoomi
Sai Surya Developers
Ram Raj
Pinks N Bloos ఇవి కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here