రాజ్ నెట్ వర్క్ చేతికి రాబోతున్న తెలుగు రాజ్ గ్రూప్ ఛానల్స్
ఇండియాలతో అతి పెద్ద నెట్ వర్క్ గా ఎదిగిన రాజ్ టెలివిజన్ నెట్ వర్క్ జెనరేషన్ మార్పులకి తగ్గట్టుగా ఎదుగుదలను మార్చుకోలేకపోయింది. అయితే వారి నెట్ వర్క్ ని మాత్రం సుస్థిరంగా ఉంచుకుంటూ వస్తున్నారు. సౌత్ ఇండియాలో రాజ్ గ్రూప్ కి పలు ఛానల్స్ ఉన్నాయి. జిఇసి, న్యూస్ ఛానల్స్ ఇందులో చోటుని కలిగి ఉన్నాయి.
తెలుగులోనూ రాజ్ నెట్ వర్క్ కి మూడు ఛానల్స్ ఉన్నాయి. విస్సాటివి, రాజ్ మ్యూజిక్స్ తెలుగు, రాజ్ న్యూస్ తెలుగు. 2004లో ప్రారంభించిన ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగించటం జరుగుతుంది. అయితే తమిళనాడులో ప్రస్తుతం రాజ్ నెట్ వర్క్ వారి ఆపరేషన్ లను పెంచుకునే పనిలో ఉంది. వారి నెట్ వర్క్ మరింత మెరుగ్గా కొనసాగేందుకు ముందుకు చర్యలు చేయపడుతున్నారు. తమిళనాడులోని లోని ఉన్న ప్రముఖ బిఇసి ఛానల్స్ కి పోటీగా ప్రస్తుత ఛానల్స్ లో మార్పులు చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా వీరి నెట్ వర్క్ లను బలోపేతంకి ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా తెలుగు ఛానల్స్ పై దృష్టిసారించారు. రాజ్ గ్రూప్ తెలుగు ఛానల్స్ లో ప్రస్తుతం లీజులో ఉన్నాయి. చాలా కాలంగా ఈ ఛానల్స్ ను అత్యవసరం సమయంలో చాలా మంది టెలికాస్ట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అదే విధంగా లీజ్ లో ఉన్న ఛానల్స్ ని వీరు లీజ్ పిరియడ్ కి ముందే తీసేసుకుంటున్నారు. జిఇసి ని బలోపేతం చేసేందుకు విస్సాటివి, రాజ్ మ్యూజిక్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టి…రెవెన్యూ పై సరికొత్త పద్దతులను, కంటెంట్ పై కొత్త దనాన్ని చూస్తున్నారు. రాజ్ న్యూస్ తెలుగుని అత్యవసరం విభాగాల కోసం ఉపయోగించేందుకు ఆలోచనలు చేస్తున్నారు.