బ‌డ్జెట్ పెంచుతున్న స్టూడియో ఒన్..యాంక‌ర్ ర‌వితో కొత్త ప్రోగ్రామ్‌ ”సూప‌ర్ మ‌చ్చి”

Anchor Ravi AudienceReports
Anchor Ravi AudienceReports

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం జిఇసి ఛాన‌ల్స్ కంటెంట్ ప‌రంగా కొద్దిగా క‌ష్టాల్నే చూస్తున్నాయి. ఛాన‌ల్స్ పెరుగుతున్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కి కొత్త కంటెంట్ ని అందించ‌టంలో జిఇసి ఛాన‌ల్స్ కాస్త ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

ఒకటే ప్రోగ్రామ్ ని పేరు మార్చి, రౌండ్స్ ని మార్చి తిరిగి అదే కంటెంట్ ని ప్రేక్ష‌కుల‌కి చూపించ‌టం జ‌రుగుతుంది. అందుకే ఈ మ‌ధ్య కాలంలో జిఇసి ఛాన‌ల్స్ కంటెంట్ ప‌రంగా ఎన్నో మార్పులు చేప‌డుతున్నాయి.

ముఖ్యంగా ఈటివి వంటి పెద్ద ఛాన‌ల్ సైతం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న ప‌టాస్, జ‌బ‌ర్ధ‌స్థ్ వంటి షోల‌లో కూడ ప‌రంగానూ, క్యాలిటీ ప‌రంగా మార్పులు చేయాలంటూ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ల‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. జీ తెలుగు, జెమినీ, స్టార్ మా వంటి ఛాన‌ల్స్ లో కంటెంట్ పై దృష్టి పెట్టాల‌ని ఫిక్ష‌న్, నాన్ ఫిక్ష‌న్ టీంల‌పై మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకువ‌స్తుంది.

ఇదిలా ఉంటే సెకండ్ గ్రేడ్ జిఇసి ఛాన‌ల్స్ గా ముద్ర ఉన్న టాలీవుడ్, స్టూడియో ఒన్ ఛాన‌ల్స్ లో అనూహ్యంగా స్టూయో ఒన్ ఛాన‌ల్ కంటెంట్ పై దృష్టి పెడుతుంది. ఈ మ‌ధ్య కాలంలో స్టూడియో ఒన్ ఛాన‌ల్ ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెట్టి కొత్త ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే టాలీవుడ్ హై రేటింగ్ ఉన్న‌ యాంక‌ర్ ర‌వి తో ఓ షోని ప్లాన్ చేసింది. సూప‌ర్ మ‌చ్చి అనే పేరుతో ఓ స‌రికొత్త ఎంట‌ర్టైన్మెంట్ షోని ప్రారంభించింది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని స్టూడియో ఒన్ ఛాన‌ల్ సొంత యూ ట్యూబ్ ప్లాట్ ఫాం లో ప‌బ్లిష్ చేయ‌టం జ‌రిగింది.

Anchor Ravi Facebook Post Super Machi


స్టూడియో ఒన్ అనేది ఇప్ప‌టి వ‌ర‌కూ మోస్ట్ వాచ్డ్ కంటెంట్ ని మాత్ర‌మే డెలివ‌రీ చేస్తుంద‌నే ఫీలింగ్ ప్రేక్ష‌కుల‌కి ఉండేది. యాంక‌ర్ ర‌వితో సూప‌ర్ మ‌చ్చి అనే ప్రోగ్రామ్ ఒక్క‌సారిగా ఛాన‌ల్ లో రావ‌టంతో ప్రేక్ష‌కులు దృష్టి ఇప్పుడు యాంక‌ర్ రవి కొత్త ప్రోగ్రామ్ మీద ప‌డింది. అయితే యాంక‌ర్ ర‌వికి సంబంధించిన ఏ వీడియో అయిన యూట్యూబ్ క‌నీసం వేలల్లో వ్యూస్ ఉంటాయి. కానీ సూప‌ర్ మ‌చ్చీ ప్రోమోకి యూ ట్యూబ్ లో వ్యూవ్స్ త‌క్కువుగా ఉన్న‌ప్ప‌టికీ…కంటెంట్ పై మాత్రం ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటి క‌నిపిస్తుంది.

సూప‌ర్ మ‌చ్చి అనే ప్రోగ్రామ్ ని 4K Media Entertainment ప్రోడ‌క్ష‌న్స్ డిజైన్ చేసి స్టూడియో ఒన్ ఛాన‌ల్ కి ఇస్తుంది. సూప‌ర్ మ‌చ్చీ అనే ప్రోగ్రామ్ ని మంచి క్యాలిటీతో ఛాన‌ల్ కి ఇచ్చేందుకు 4K Media Entertainment ప్రొడక్ష‌న్స్ చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసింద‌ని చెప్పాలి.

Production Banner : 4K Media Entertainment

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here