తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్ కి సంబంధించిన సేవలు ప్రజల వద్దకు తీసుకుపోవటం అనేది చాలా అత్యవసరం గా ఉంది. ఎంత అత్యాధునిక హాస్పిటల్ అయినా, సక్సెస్ రేటు కలిగి ఉన్న ఏ డాక్టర్ అయినా ప్రస్తుతం సొసైటీలో వారికి ప్రచారం అనేది తప్పనిసరి అయింది.
అటువంటి కార్పోరేట్ స్థాయిలో అన్ని రకాల సర్వీస్ లను అందిస్తున్న టాప్ హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అయితే వారి సర్వీస్ లను ప్రజల వద్దకు తీసుకుపోయేందకు ఆ హాస్పిటల్స్ ప్రచార ఖర్చు కోసం భారీగానే ఖర్చు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అపోలో, యశోద, కేర్, మాక్స్ క్యూర్, రెమెడీ హాస్పిటల్స్, ఒమిని హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, పేస్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, సిటిజెన్ హాస్పిటల్స్, ఒమేగా హాస్పిటల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మరో పది హాస్పిటల్స్ పైగానే ఉంటాయి. వీటిలో అడ్వెర్టైజ్మెంట్స్ కోసం ప్రతి హాస్పిటల్ కొంత బడ్జెట్ ని కేటాయిస్తుంది. ఒక్కో హాస్పిటల్ ది ఒక్కో ప్రత్యేకత. అపోలో, యశోద, సిటిజెన్, గ్లోబల్, ఒమిని, రెమెడీ, కాంటినెంటల్ ఈ తరహా హస్పిటల్స్ అయితే సంవత్సరం పొడవునా ఆన్ గోయింగ్ క్యాంపెయిన్స్ ని చేస్తుంది.
అయితే ఆడియన్స్ రిపోర్ట్స్ చేసిన సర్వే ప్రకారం, ప్రకటనల ఖర్చు కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్న హాస్పిటల్ లో యశోద హాస్పిటల్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో అపోలో హాస్పిటల్, కాంటినెంటల్, సిటిజెన్ హాస్పిటల్, రెమెడీ, ఒమిని వంటి హాస్పిటల్స్ ఉన్నాయి.
యశోద, అపోలో, కాంటినెంటర్, సిటిజెన్, వంటి హాస్పిటల్ సంవత్సరం పొడవునా ఆన్ గోయింగ్ ప్రమోషన్స్ ని చేస్తుంది. యశోద హాస్పిటల్ అయితే కొన్ని ఏరియాల్లో ఫిక్స్ హోర్డింగ్ ప్లేస్ ని లీజ్ కి తీసుకుందని చెప్పవచ్చు. ప్రతి నెల రోజులు, లేక 20 రోజులకొక సారి ప్రదేశాల్లో వారి సర్వీస్ లకి సంబంధించిన ఇన్నేవేషన్ యాడ్స్ ని అందులో చూపెడుతుంది. ఇలాంటి పెద్ద హోర్డింగ్స్ హైదరాబాద్ లో పదికి పైగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక సర్వీస్ లకి సంబంధించిన సమాచారాన్ని చాలా క్రియేటివ్ గా చూపించటంలోనూ యశోద హాస్పిటల్ మొదటి స్థానంలో ఉంది.
ఆ తరువాత అపోహాస్పిటల్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ అపోలో హాస్పిటల్ హోర్డింగ్స్ కి తక్కువ ఖర్చు చేస్తున్నప్పటికీ…ఈవెంట్స్ కి ఎక్కువ ఖర్చు చేయటంలో రెండవ స్థానంలో ఉంది. తరువాత సిటిజెన్ హాస్పిటల్ వారు అమెరికన్ అంకాలజీ ఇన్ స్టిస్ట్యూట్ ని ప్రమోట్ చేసుకోవటం లో మూడవ స్థానంలో ఉన్నారు. రెమెడీ, ఒమిని, గ్లోబల్ హాస్పిటల్స్ అన్నీ ఒకే తరహా బడ్జెట్ ని మెయింటెన్ చేస్తున్నాయి.
mailus@audiencereports.com