క్యాలిటీ కంటెంట్ పై తెలుగు GEC ఛాన‌ల్స్ ప్ర‌త్యేక దృష్టి

Telugu GEC Channels AudienceReports.com
Telugu GEC Channels AudienceReports.com

ప్ర‌స్తుతం తెలుగు భాష‌లోని జిఇసి ఛాన‌ల్స్ మ‌ధ్య పెద్ద పోటీ ఉంది. స్టార్ మా కి సంబంధించిన గ్రూపు ఛాన‌ల్స్, ఈటివి కి సంబంధించిన గ్రూపు ఛాన‌ల్స్, అలాగే జీ తెలుగు, జెమిని కి సంబంధించిన గ్రూపు ఛాన‌ల్స్ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంది.

గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల నుండి ఈటికి గ్రూపు ఎంట‌ర్ట్మైన్మెంట్ స్ట్రాట‌జీని మార్చి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని అందిస్తుంది. అందులోని భాగంగానే ఢీ, జ‌బ‌ర్ధ‌స్త్‌, ప‌టాస్ వంటి సిరీస్ ఎంట‌ర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ని నిరంత‌రాయంగా న‌డుపుతుంది. ఈ ప్రోగ్రామ్స్ ప్రేక్ష‌కుల్లోనూ గుర్తుండిపోయాయి.

ఇక స్టార్ మా కి సంబంధించిన గ్రూపు విష‌యంలో కొత్తద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ…జ‌నాల్లోకి రిజిష్ట‌ర్ అయ్యేవిధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ జ‌ర‌గ‌టం లేదు. కానీ సీరియ‌ల్స్ విష‌యంలో అన్ని ఛాన‌ల్స్ కంటే స్టార్ మానే అత్య‌ధిక ప్రేక్ష‌క ఆధ‌ర‌ణ క‌లిగి ఉన్న ఛాన‌ల్ గా నిలిచింది. మా నుండి స్టార్ గా మారిన క్ర‌మంలో స్టార్ గ్రూపు కంటెంట్ క్యాలిటీపై ప్ర‌త్యేక దృష్టిని పెట్టింది. సీరియ‌ల్స్ విష‌యంలో క్యాలిటీని పెంచి, అన్ని ఛాన‌ల్స్ కంటే అత్య‌ధిక ప్రేక్ష‌క ఆధ‌ర‌ణ క‌లిచిన సీరియ‌ల్స్ ని స్టార్ మా ప్రస్తుతం కంటిన్యూ చేస్తుంది.

ఇక జెమిని టెలివిజ‌న్ విష‌యంలో కంటెంట్ ప‌రంగా భారీ మార్పులు ఏమి జ‌ర‌గ‌లేదు. కొద్దిపాటి మార్పుల‌తోనే ప్ర‌స్తుతం ఉన్న ఛాన‌ల్స్ కి కాంపిటీష‌న్ ని ఇస్తుంది.

జీ తెలుగు విష‌యంలోనూ ఈటివి గ్రూప్ లో వ‌స్తున్న ఎంట‌ర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్క‌డ రావటం లేదు. కానీ సీరియ‌ల్స్, మూవీలు విష‌యంలోనూ కంటెంట్ ను స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఈటివి, జీ తెలుగు, స్టార్ మా, జెమిని కి సంబంధించిన గ్రూపుల ఛాన‌ల్స్ కాకుండా ఇత‌ర జిఇసి ఛాన‌ల్స్ ఇక్క‌డ మ‌రికొన్ని ఉన్నాయి.

టాలీవుడ్, స్టూడియో వ‌న్, విస్సా టివి, రాజ్ మ్యూజిక్స్ తెలుగు వంటి త‌క్కువ బ‌డ్జెట్ తో న‌డిచే ఛాన‌ల్స్ ఉన్నాయి. ఈ ఛాన‌ల్స్ లో కంటెంట్ పూర్తిగా చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల‌తో న‌డుస్తున్న ఛాన‌ల్స్ లో వీటిని ఎంత మాత్రం పోల్చ‌లేము. సెకండ్ సేల్ కంటెంట్ వీటిల్లో ఎక్కువుగా క‌నిపిస్తుంది. ఎక్స్ క్లూజిక్ కంటెంట్ కి చాలా త‌క్కువుగా ఉంటుంది.

అయితే ప్ర‌స్తుతం స్టూడియో వ‌న్ ఛాన‌ల్ మాత్రం కంటెంట్ పై ప్ర‌త్యేకమైన దృష్టిపెడుతున్నారు కానీ…టెలికాస్ట్ అవుతున్న కొత్త కంటెంట్ అనేది లోక‌ల్ మార్కెట్ ని ఎంత మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోతుంది.

-mailus@audiencereports.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here