2019కి తెలుగు రాష్ట్రాల విద్యా ప్ర‌క‌ట‌న ఖ‌ర్చు 870 కోట్ల రూపాయ‌లు ఉండొచ్చు

Education Advertisement AudienceReports.com

ప్ర‌తి సంవ‌త్స‌రం తెలుగు రాష్ట్రాల్లో అక‌డ‌మిక్ ఇయ‌ర్ ప్రారంభం నాటికి స్కూల్స్, కాలేజ్, యూనివ‌ర్సిటి, ఎబ్రాడ్ ఎడ్యుకేష‌న్ వంటి స‌ర్వీస్ ల‌కి సంబంధించి స‌మాచారంను విద్యార్ధుల వ‌ద్ద‌కు తీసుకువెళ్ళేందుకు యాజ‌మాన్యాలు భారీగా ఖ‌ర్చు చేస్తున్నాయి. ప్ర‌క‌ట‌న రూపంలో పెద్ద పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెడుతున్నాయి.

ఆ విధంగానే 2019వ సంత్స‌రంలో కొత్త అక‌డ‌మిక్ ఇయ‌ర్ కి సంబంధించిన స‌మాచారాన్ని విద్యార్ధుల వ‌ద్దకు తీసుకువెళ్ళేందుకు యాజమాన్య సంస్థ‌లు ఖ‌ర్చు పెట్టేది మొత్తం 870 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌నేది ఓ అంచ‌నా ఉంది.

2018వ సంవ‌త్స‌రంలో దాదాపు 600 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టిన‌ట్టుగా తెలుస్తుంది. ఎబ్రాడ్ ఎడ్యుకేష‌న్ కోసం ముఖ్యంగా ఎబ్రాడ్ ఎం.బి.బి.య‌స్ కోసం ఒక్కో క‌న్స‌ల్టెన్సీ ప్ర‌క‌ట‌న‌ల కోస‌మే దాదాపు 60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

స్కూల్స్ , ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజ్ లు, డిగ్రీ, ఎం.బి.ఎ, ఇంజ‌నీరింగ్ వంటి క‌ళాశాలు ఈసారి ప్ర‌క‌ట‌న‌ల కోసం భారీగా ఖ‌ర్చు పెడుతున్నారు. దీంతో ప్రింట్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా, రేడియో, మొబైల్ అడ్వెర్టైజింగ్, అవుట్ డోర్ వంటి మీడియంల‌లో ఇప్ప‌టికే అడ్వాన్డ్స్ పేమంట్ తో పాటు, ప్యాకేజింగ్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏజెన్సీలు, విద్యా సంస్థ‌లు మ‌ధ్య జ‌రగ‌టం జ‌రిగింది.

అయితే ఈసారి ఏజెన్సీల కంటే విద్యాసంస్థ‌లు డైరెక్ట్ గా అడ్వెర్టైజ్మెంట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ తో డీలింగ్స్ చేసుకోవ‌టం విశేషంగా ఉంది. ఏజెన్సీల‌కి సంబంధించిన క‌మీష‌న్ విష‌యంలో కొన్ని విద్యా సంస్థ‌లు త‌క్కువ స‌ర్వీస్ కమీష‌న్ ని కోట్ చేస్తున్నాయి. దీంతో ఆ ఏజెన్సీలు ఇందుకు అంగీక‌రించ‌క‌పోవ‌టంతో విద్యా సంస్థ‌లల‌కి కొంత క‌మీష‌న్ ఆదా అవుతుంద‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here