GEC ఛాన‌ల్స్ ప్రోగ్రామ్స్ పై రీజ‌న‌ల్ క్లైంట్స్ ఒత్తిడి

GEC Channels Revenue AudienceReports.com
GEC Channels Revenue AudienceReports.com

తెలుగులో గ‌త అయిదు సంవ‌త్స‌రాల నుండి GEC ఛాన‌ల్స్ కి సంబంధించిన కొత్త స్ట్రాట‌జీ, ఆడియ‌న్స్ ను టివికు క‌ట్టిప‌డేసాలా చేస్తుంది.

ఈటివి, జెమిని టివి, స్టార్ మా, జీ తెలుగు వంటి ఛాన‌ల్స్ కంటెంట్ విష‌యంలో ఒక‌రిని మించి ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. అయితే జిఇసి ఛాన‌ల్స్ రెవెన్యూ విష‌యంలో యాడ్స్ ది కీల‌క పాత్ర‌. రేటింగ్స్ వ‌స్తే మాత్రం సరిపోదు, రేటింగ్స్ తో పాటు ఛాన‌ల్ రేట్ కార్డ్ ను కూడ పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఆ మేనేజ్మెంట్ కి ఎంతో ఉంది.

ఛాన‌ల్ రెవెన్యూలో రెండు కీల‌కంగా ఉంటాయి. నేష‌న‌ల్ యాడ్స్, రీజ‌న‌ల్ యాడ్స్. నేష‌న‌ల్ యాడ్స్ కి ఛాన‌ల్ కంటెంట్ క్యాలిటీ అవ‌స‌రం ఉండ‌దు. ఛాన‌ల్ కి వస్తున్న GRP ల‌ను బ‌ట్టి యాడ్స్ ని కేటాయిస్తారు. ఛాన‌ల్ GRPలు బాగా ఉంటే కంటెంట్ బాగుంటుంద‌ని, ఆ ఛాన‌ల్ కి ఆధ‌ర‌ణ బాగుంటుంద‌నేది నేష‌న‌ల్ యాడ్స్ ఇస్తున్న క్లైంట్స్ స్ట్రాట‌జీ. అయితే రీజ‌న‌ల్ యాడ్స్ ఇందుకు పూర్తిగా విరుద్దం.

రీజ‌న‌ల్ యాడ్స్ విష‌యంలో ఛాన‌ల్ కి మంచి GRP లు ఉంటే స‌రిపోదు, కంటెంట్ చాలా కీలంగా భావిస్తారు. ఛాన‌ల్ లో మంచి ప్రోగ్రామ్స్ వ‌స్తున్నాయా? ప్రేక్ష‌క ఆధ‌ర‌ణ ఎలా ఉంది? లోక‌ల్ రెస్పాన్స్ ఎలా ఉంది? జ‌నాల్లో ఆ ప్రోగ్రామ్ రీచ్ ఎంత వ‌రకు ఉంది? ఆ ఛాన‌ల్ కి డిస్ట్రిబ్యూష‌న్ ఎలా ఉంది? వ‌ంటి టెక్నిక‌ల్ విష‌యాల‌ను కూడ ఒక్కోసారి ప‌రిగ‌ణంలోకి తీసుకుంటున్నారు. ఈ విధమైన ఈక్వేష‌న్స్ ని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం అంత‌టా రీజ‌న‌ల్ క్లైంట్స్, వారి ప్ర‌క‌ట‌న‌ల‌ను ఛాన‌ల్స్ కి ఇచ్చేట‌ప్పుడు ఇలాగే చూస్తారు. సాధార‌ణంగా న్యూస్ ఛాన‌ల్స్ లో రెవెన్యూ వ‌చ్చేస‌రికి 40 శాతం రీజ‌న‌ల్ యాడ్స్ కి, 60 శాతం నేష‌న‌ల్ యాడ్స్ కి ఉంటుంది. ఇదే GEC ఛాన‌ల్స్ లో అయితే 35 శాతం రీజ‌న‌ల్స్ యాడ్స్ కి ఉంటే, 65 శాతం నేష‌న‌ల్స్ యాడ్స్ కి ఉంటుంది. అయితే గ‌త 4 సంవ‌త్స‌రాల నుండి టెలివిజ‌న్ లో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా GEC ఛాన‌ల్స్ రెవెన్యూ లో 85 శాతం నేష‌న‌ల్ యాడ్స్, 15 శాతం రీజ‌న‌ల్ యాడ్స్ ఉంటున్నాయి. న్యూస్ ఛాన‌ల్స్ లో మాత్రం మార్పులు ఏమి జ‌ర‌గ‌లేదు.
ఇక తెలుగు ఛాన‌ల్స్ విష‌యానికి వ‌స్తే…తెలుగులో GEC ఛాన‌ల్స్ రీజ‌న‌ల్స్ యాడ్స్ పై ప్ర‌త్యేక దృష్టిని పెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే వారి ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేయ‌బడుతున్నాయి. ఇప్ప‌టికే ఈటివి గ్రూపు నుండి ప్ర‌సారం అవుతున్న‌ GEC ఛాన‌ల్స్ లో చాలా ప్రోగ్రామ్స్ రీజ‌న‌ల్ క్లైంట్స్ ను మెప్పించేలా ఉన్నయి. ఈ విధంగా రీజ‌న‌ల్ క్లైంట్స్ దృష్టిలో మంచి కంటెంట్ ప‌రంగా ఏ ఛాన‌ల్ ఏఏ స్థానంలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో రీజ‌న‌ల్ క్లైంట్స్ కి న‌చ్చుతున్న GEC ఛాన‌ల్స్ ప్రోగ్రామ్స్.

  1. ఈటివి
  2. మాటివి
  3. జీ తెలుగు
  4. జెమిని టీవి

లో బ‌డ్జెట్ లో కొత్త‌గా ప్రొగ్రామ్స్ తెర‌కెక్కిస్తున్న‌ప్ప‌టికీ క్లైంట్స్ కి న‌చ్చ‌ని GEC ఛాన‌ల్స్ ప్రోగ్రామ్స్.

  1. స్టూడియో ఒన్
  2. టాలీవుడ్
  3. విస్సా టివి

లో బ‌డ్జెట్ లో కొత్తగా ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తున్న స్టూడియో ఒన్ ఛాన‌ల్, టాలీవుడ్ ఛాన‌ల్, విస్సా టివి వంటి GEC ఛాన‌ల్స్ మార్కెటింగ్ టీం రీజ‌న‌ల్ క్లైంట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళిన‌ప్పుడు తీవ్ర నిరాశ ఎదుర‌వుతుంద‌ని సీనియ‌ర్ మార్కెటింగ్ మేనేజ‌ర్ చెప్పుకొచ్చారు. ప్రోగ్రామ్స్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఛీప్ గా ఉండ‌టంతో పాటు, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ లో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేక‌పోవ‌టం అనేది క్లైంట్స్ ద‌గ్గ‌ర నుండి వ‌స్తున్న రిపీటెడ్ క్వ‌శ్ఛ‌న్స్.

అలాగే, టాప్ GEC ఛాన‌ల్స్ సైతం రీజ‌న‌ల్ క్లైంట్స్ నుండి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాలిటీ కంటెంట్ ను పెంచాలి అని వారు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఆ విధంగా ఈ టాప్ GEC ఛాన‌ల్స్ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మంచి కంటెంట్ ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాయి.

-audiencereports.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here