ఈటివి-భారత్ యాప్ కాల్ పర్మిషన్స్ ని ఎందుకు అడుగుతుంది?

Etv Bharath AudienceReports.com
Etv Bharath AudienceReports.com

ఒన్ నేషన్-ఒన్ యాప్ పేరుతో ఈటివి గ్రూప్ కి సంబంధించిన ఓ డిజిటల్ యాప్ ఇప్పుడు భారతదేశపు డిజిటల్ న్యూస్ లో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టింది.

న్యూస్ కి సంబంధించి అప్ డేట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి ఆ రాష్ట్రానికే ఒకే ఒక్క యాప్ లో ఇవ్వటం దీని ప్రత్యేకత. అంతే కాకుండా న్యూస్ అప్ డేటింగ్స్ ని ఇది ఎప్పటికప్పుడు వేగంగా ఇస్తుంది. రిలయన్స్ జియో తరువాత అంత వేగంగా ఒక న్యూస్ కి సంబంధించిన మీడియంలో యాప్ ఆధారంగా సర్వీస్ లని అందిస్తున్న ఒకే ఒక్క నెట్ వర్క్ ఈటివి-భారత్ అని చెప్పవచ్చు.

ఇంకా ఈటివి భారత్ కి సంబంధించిన ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. అయితే ఈటివి న్యూస్ కి ఇండియాలో ఓ బ్రాండ్ ఉంది. ఈటివి న్యూస్ అంటే అది కచ్ఛితం అయి ఉంటుందన వ్యూవర్స్, రీడర్స్ అభిప్రాయం. ఈటివి భారత్ లాంచింగ్ అనేది ఎంతో అట్టహాసంగా జరుగింది. ప్రతి రాష్ట్రా ముఖ్యమంత్రి ఈ యాప్ లాంచింగ్ లో ఒకే రోజు పార్టిసిపేట్ చేశారు.

అయితే ఈటివి భారత్ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటివరకూ 500000 మంది మాత్రమే యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ మార్కెట్ అంచనా ప్రకారం భారీ నెట్ వర్క్ కలిగిఉన్న ఈటివికి, యాప్ డౌన్ లోడ్స్ అనేది మొదటి రెండు నెలలోనే 10 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకుంటారు అనేది వారి అంచనా. 23 రాష్ట్రాల్లో సేవ‌లు అందిస్తున్న ఈటివి భార‌త్ కి 10 ల‌క్ష‌ల యాప్ డౌన్ లోడ్ అనేది చాలా సుల‌భ‌మైన విష‌యం అని అంద‌రూ అనుకున్నారు.

కానీ, యాప్ లాంచింగ్ త‌రువాత టెక్నిక‌ల్ గా ఇది చాలా క‌ష్టం అనిపించింది. రీడ‌ర్స్ ఈటివి భార‌త్ యాప్ కి అల‌వాటు ప‌డ‌టానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. యాప్ కి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై రీడ‌ర్స్ కి స‌రైన అవ‌గాహ‌న‌ను క‌లిగించుకోలేక‌పోయారు. ప్ర‌తి అయిదునిముషాలు న్యూస్ అప్ డేష‌న్ అనేది ఇందులో కీలకం. కానీ ఈ కొత్త ఫార్మెట్ కి రీడ‌ర్స్ ఇంకా అటాచ్ కాలేద‌ని చెప్పాలి.

అయితే యాప్ ప్రైవ‌సీ కి సంబంధించిన విష‌యంలో ఈ మ‌ధ్య కాలంలో డౌన్ లోడ‌ర్స్ ప‌లు విష‌యాలు స‌మ‌స్య‌లుగా లేవ‌నెత్తుతున్నారు. యాప్ డౌన్ లోడ్ స‌మ‌యంలో కాల్ ప‌ర్మిష‌న్స్ అడుగుతుంద‌ని యాప్ ప్లే స్టోర్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువుగా కామెంట్స్ సెక్ష‌న్ లో పోస్టింగ్ అవుతున్న క్వ‌శ్ఛ‌న్. దీనికి యాప్ నిర్వాహ‌కులు మాత్రం రెగ్యుల‌ర్ రీ-కామెంటింగ్ ఇస్తున్నారు. దీనికి డౌన్ లోడ‌ర్స్ మాత్రం ఏ మాత్రం సంతృప్తి చెంద‌టం లేదు. దీని కార‌ణంగా కొంత ప‌ర్సెంటేజ్ డౌన్ లోడ్స్ త‌గ్గే అవ‌కాశం క‌చ్ఛితంగా ఉంద‌ని యాండ్రాయిడ్ యాప్ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రైవ‌సీ అనేది ప్ర‌తి డౌన్ లోడ‌ర్ కోరుకుంటారు కాబ‌ట్టి.

అయితే ఈనాటి రోజుల్లో ప్ర‌తి సాధార‌ణ స‌ర్వీస్ ఇస్తున్న యాప్ సైతం కాల్ పర్మిష‌న్స్, డేటా ప‌ర్మిష‌న్స్ ని అడుగుతుంది. ఇది సాధార‌ణ విష‌యం గా మారింది. అయితే పెద్ద బ్రాండ్ క‌లిగిన న్యూస్ ఎజెన్సీగా ఉన్న ఈటివి, కాల్ ప‌ర్మిష‌న్స్ ని అడుగుతుండ‌టం అనేది డౌన్ లోడ‌ర్స్ కి సంతృప్తిని ఇవ్వ‌టం లేదు. కాల్ ప‌ర్మిష‌న్స్ ని యాప్ తొల‌గిస్తే…డౌన్ లోడ్స్ అనేవి చాలా వేగంగా జరిగే అవ‌కాశం ఉంద‌ని ప్లేస్టోర్ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు.

అయితే ఏప్రిల్ త‌రువాత యాప్ అప్ డేష‌న్ లో కాల్ ప‌ర్మిష‌న్ ని తొల‌గించిన‌ట్టుగా కొంత మంది యూజ‌ర్స్ డౌన్ లోడ్ చేసుకున్న‌దాంట్లో తెలుస్తుంది.

ఇక మిగ‌తా విష‌యాల‌కి వ‌స్తే, యాప్ ఈటివి భార‌త్ యాప్ చాలా బాగుంద‌నే కామెంట్స్ ఎక్కువుగా ఉన్నాయి. ఓవ‌రాల్ గా చూసుకుంటే 30 శాతం నెగిటివ్ కామెంట్స్ (ప్రైవ‌సీకి సంబంధించి), 70 శాతం పాజిటివ్ కామెంట్స్ ఈటివి భార‌త్ ప్లేస్టోర్ లో నిరంతం క‌లిగిఉంటుంది.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here