అడ్వెర్టైజ‌ర్స్ ని ఆక‌ట్టుకుంటున్న ZEE మహోత్సవం 2019 వేడుక‌లు

ZEE Mahotsavam 2019 AudienceReports.com

ZEE మహోత్సవం 2019 వేడుకలు తాజాగా విశాఖ‌ప‌ట్నం లో ఘ‌నంగా జ‌రుపుకున్నాయి. టాలివుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్యూటీ రష్మిక ఈ వేడుక‌లో ప్రధాన ఆకర్షణంగా కనిపించారు.

ZEE మహోత్సవం 2019 వేడుకలను జీ తెలుగు గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ స‌మ్మ‌ర్ లో జీఇసి ఛాన‌ల్స్ నుండి వ‌స్తున్న ప్ర‌ధానమైన ఈవెంట్ గా ZEE మహోత్సవం 2019 వేడుకలు నిల‌వ‌నున్నాయి. ఈసారి ZEE మహోత్సవం 2019 వేడుకలని చాలా క‌ల‌ర్ ఫుల్ గా ప్లాన్ చేశారు.

స్టార్ హీరో స్టేట‌స్ ను అందుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ప్రాగ్రామ్ కి రాగా, త‌న ఎంట్రిని జీ తెలుగు టీం గ్రాండ్ గా ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన కొన్ని హైలెట్స్ ని జీ తెలుగు ఛాన‌ల్ త‌న యూ ట్యూబ్, అండ్ డిజిటల్ మీడియంలో పెట్టింది. దీనికి సంబంధించిన బిజినెస్ సైతం ఎక్కువుగానే జ‌రిగింద‌ని అంటున్నారు.

ZEE మహోత్సవం 2019 వేడుకలకి సంబంధించి హైలైట్ వీడియో క‌టింగ్ చాలా బాగుంది. ప్రోమోని చాలా బాగా క‌ట్ చేసి రీలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఇది రీజ‌న‌ల్ క్ల‌యింట్స్ ని తెగ ఆక‌ట్టుకుంటుంది. ప్రోమో బ‌య‌ట‌కు రావ‌టంతో రీజ‌న‌ల్ క్ల‌యింట్స్ సైతం ఈ ఈవెంట్ కి సంబంధించిన యాడ్స్ పై కాస్త ఆస‌క్తి చూప‌టం జ‌రుగుతుంది.

ఇంకా ZEE తెలుగు సీరియల్స్‌లో నటించే మీ ఫేవరేట్ తారలందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయ‌టం ప్రేక్ష‌కుల‌ను మ‌రింత అల‌రించే విధంగా ఉంది. ఇక ZEE మహోత్సవం 2019 ఈవెంటును మే 26న జీ తెలుగులో చూడ‌వ‌చ్చు. ఛాన‌ల్ లో దీనికి సంబంధించిన టైం ని ఇప్ప‌టి నుండే ప్ర‌మోట్ చేస్తున్నారు.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here